ప్రతీ వాహనం తనిఖీ చేయాల్సిందే..
చేర్యాల(సిద్దిపేట): ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో ప్రతీ వాహనం తనిఖీ చేయాలని, టైమ్‌తో సహా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం మండల పరిధిలోని ముస్త్యాలలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రిజిస్టర్‌ను పరిశీలించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ మొత్తం వీడియో తీయాలని సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని ముస్యాల క్లస్టర్‌లో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు గుంపులు గుంపులుగా వచ్చి నామినేషన్ వేయకూడదని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
టైంతో సహా వివరాలు నమోదు చేయాలి
కలెక్టర్ హైమావతి


