ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
బెజ్జంకి(సిద్దిపేట): ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో మాట్లాడుతూ పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. హాజరు శాతాన్ని మరింత పెంచాలన్నారు. ల్యాబ్ పరీక్షల కోసం విద్యార్థులకు వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలకు సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్‌ను, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను, యూనిట్ టెస్టులకు సంబంధించిన మార్కులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై 90 రోజుల ప్రణాళిక, బిల్డింగ్ మరమ్మతుల పనులను, స్పోర్ట్స్ మెటీరియల్, వార్షిక పరీక్షలకు సంబంధించిన సూచనలు చేశారు.
ఆరోగ్యానికి
నడక తప్పనిసరి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరూ రోజూ యోగా, వాకింగ్ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టు భవనంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్, ఇతర రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు సెషన్స్ జడ్జి జయప్రసాద్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాధన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి తరణి, అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, డీఎంహెచ్‌ఓ ధనరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి


