వైభవంగా మూల మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మూల మహోత్సవం

Oct 28 2025 9:08 AM | Updated on Oct 28 2025 9:08 AM

వైభవం

వైభవంగా మూల మహోత్సవం

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధ వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రం కార్తీక సోమవారం మూల మహోత్సవ వేడుకలతో శోభిల్లింది. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, కుంకుమార్చన, చతుషష్ట్యోపచార పూజ నిర్వహించారు. అమ్మవారి నామం స్మరిస్తూ భక్తజన సామూహిక లక్షపుష్పార్చన చేశారు. యాగశాలలో చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తజనులు వేడుకలలో పాల్గొని తరించారు.

పోటీ పరీక్షలపై

యువతకు అవగాహన

సిద్దిపేటఎడ్యుకేషన్‌: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాలలో సోమవారం యువత, విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ కళాశాల గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ వంగాల శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు సమయపాలన, ప్రణాళిక, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. యూపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్సీ, బ్యాంకింగ్‌, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు సబంధించిన సమాచారంతో పాటు ప్రిపేర్‌ అయ్యే విధానాలను వివరించారు. గతంలో పోటీ పరీక్షలు రాసి ఉద్యో గాలు సాధించిన వారి అనుభవాలను గూర్చి వివరించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ యువత ప్రభు త్వం అదిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ పవన్‌కుమార్‌, సీఓఈ డాక్టర్‌ గోపాలసుదర్శనం, మధుసూదన్‌, వైఎల్‌ఎన్‌రెడ్డి, రాధిక, డాక్టర్‌ దీపిక, సంగీత, రమ్య తదితరులు పాల్గొన్నారు.

బస్సు కోసం

గ్రామస్తుల ఆందోళన

మిరుదొడ్డి(దబ్బాక): గ్రామంలోకి బస్సు రావాలని డిమాండ్‌ చేస్తూ అందె జేఏసీ నాయకులతో పాటు గ్రామస్తులు సోమవారం రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయా అందె మీదుగా సిద్దిపేట– దౌల్తాబాద్‌ ఆర్టీసీ బస్సు నడపాల్సి ఉండగా ఇదేమి పట్టకుండా అందె గ్రామంలోకి బస్సు రాకుండా వెళుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి సిద్దిపేట పట్టణానికి విద్యార్థులు, ప్రయాణికులు నిత్యం వెళ్తుంటారన్నారు. గ్రామంలోకి బస్సు రాకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అందె క్రాస్‌ రోడ్డు వరకు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి అందె వయా బస్సును యథావిధిగా నడపాలని గ్రామ జేఏసీ నాయకులు కోరారు. ఆందోళనపై సిద్దిపేట ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్‌ ద్వారా గ్రామస్తులు తెలియజేశారు. కార్యక్రమంలో అందె జేఏసీ నాయకులు లింగం, రాజు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు

మంజూరు చేయండి

సిద్దిపేటజోన్‌: పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆందో ళన చేపట్టారు. స్థానిక క్లాక్‌ టవర్‌ నుంచి శివాజీ చౌక్‌ వరకు సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. జిల్లా కన్వీనర్‌ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విడుదల చేయా లని కోరారు. పేద విద్యార్థులకు చదువు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు.

వైభవంగా మూల మహోత్సవం 1
1/2

వైభవంగా మూల మహోత్సవం

వైభవంగా మూల మహోత్సవం 2
2/2

వైభవంగా మూల మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement