
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు
గజ్వేల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహణపై మంగళవారం బీజేపీ నేతలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు కోసం వాడుకోవాల్సిన క్యాంపు కార్యాలయాన్ని ప్రైవేటు కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడిక్యాల రాములు, ఎస్సీమో ర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.