
వేదస్వరూపిణి.. సకల శుభకరి
బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా నేత్రపర్వం చేస్తున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం ఆయా మండపాలలో, దేవాలయాలలో అమ్మవార్లను గాయత్రీ దేవిగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. వర్గల్ సరస్వతి క్షేత్రంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వర్గల్ ఉత్సవాలకు రావాలంటూ నగరంలో రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలను ఆలయకమిటీ ప్రతినిధులు కలిసి ఆహ్వానపత్రికలు అందజేశారు. గజ్వేల్ పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో 400కిలోల కుంకుమతో త్రిమూర్తి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా, మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/
వర్గల్(గజ్వేల్)/గజ్వేల్‌రూరల్

వేదస్వరూపిణి.. సకల శుభకరి

వేదస్వరూపిణి.. సకల శుభకరి