
నేడు ఉత్తమ గురువులకు సన్మానం
విజయరేఖ
వెంకట్రామిరెడ్డి
ఉమారాణి
జయప్రకాశ్‌రెడ్డి
శ్రీనివాస్‌రెడ్డి
వరలక్ష్మి
కృష్ణారెడ్డి
వర్గల్(గజ్వేల్)/కొండపాక(గజ్వేల్)/జగదేవ్‌పూర్(గజ్వేల్)/గజ్వేల్‌రూరల్: ఉత్తమ ఉపాధ్యాయులు శనివారం సన్మానం పొందనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కొందరు ఎంపి కైన విషయం తలిసిందే. అందులో భాగంగా వర్గల్ కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంగ్లిష్ టీచర్ ఎల్.వరలక్ష్మి, చౌదరిపల్లి జెడ్పీహైస్కూల్‌లో ఫిజికల్ సైన్స్ టీచర్ పి.కృష్ణారెడ్డి ఎంపికయ్యారు. వారికి సిద్దిపేటలో అవార్డులు అందజేయనున్నారు. అలాగే కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి హైస్కూల్లో గెజిటెడ్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి, సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న జయప్రకాశ్‌రెడ్డి, మర్పడ్గ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఉమారాణి ఎంపికయ్యారు. జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి ఎంపికైనట్లు ఎంఈఓ మాధవరెడ్డి తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.విజయరేఖ ఎంపి కై నట్లు ఎంఈఓ కృష్ణ తెలిపారు. ఆమెను ఉపాధ్యాయులు అభినందించారు.

నేడు ఉత్తమ గురువులకు సన్మానం

నేడు ఉత్తమ గురువులకు సన్మానం

నేడు ఉత్తమ గురువులకు సన్మానం

నేడు ఉత్తమ గురువులకు సన్మానం

నేడు ఉత్తమ గురువులకు సన్మానం

నేడు ఉత్తమ గురువులకు సన్మానం