
పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగుదాం
రాష్ట్ర ఆర్యవైశ్య నేత శంకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదవారికి చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థాయికి చేర్చాలని సూచించారు. మనకున్న సంపద, తెలివితేటలను పేదల శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట అధ్యక్షుడు గంప శ్రీనివాస్, నేతలు అయిత కిషోర్, యాసాల వెంకట లింగం, గరిపెల్లి సిద్దేశ్వర్, మాంకాల లింగమూర్తి ఆధ్వర్యంలో ఆ అసోషియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా గెజిటెడ్ హెచ్‌ఎం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విఠల్, కోశాధికారిగా అడ్వకేట్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్, శివ, అడ్వకేట్ కొ మరవెల్లి మహేశ్, శ్రీనివాస్, కార్యదర్శులుగా శ్రీ కాంత్, సతీశ్‌కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. వైకుంఠం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.