
ఆయిల్‌పామ్ యంత్రాల ట్రయల్ రన్
నంగునూరు(సిద్దిపేట): మండలం నర్మేటలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో మలేషియా కన్సల్టెన్సీ బృందం సభ్యులు శుక్రవారం యంత్రాల ట్రయల్ రన్ నిర్వహించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పనులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి అంతర్జాతీయ కన్సల్టెంట్ హజ్‌మాన్ ఫ్యాక్టరీ లోని అన్ని యంత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీజీ ఆయిల్‌ఫెడ్ మెనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య, ఓఎస్‌డీ కిరణ్‌కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.