
వరాల తల్లీ.. వందనం
ఘనంగా వరలక్ష్మి వ్రతాలు..
ఆలయాల్లో భక్తుల సందడి
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, పార్వతీ దేవి, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, తదితర ఆలయాల్లో అభిషేకాలు, హోమాలు, సామూహిక వ్రతాలు చేపట్టారు. అమ్మవార్ల మూలవిరాట్‌లను ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఇళ్లల్లోనూ వరలక్ష్మి వ్రతాలను మహిళలు నిర్వహించారు. పూజల అనంతరం వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)

వరాల తల్లీ.. వందనం

వరాల తల్లీ.. వందనం

వరాల తల్లీ.. వందనం