
యూరియా కోసం నిరీక్షణ
యూరియా కోసం చెప్పులను
క్యూలైన్‌లో పెట్టిన రైతులు
నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల పీఏసీఎస్‌కు శుక్రవారం యూరియా రావడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు భారీగా తరలివచ్చారు. లారీలో 560 బస్తాల యూరియా రావడం.. అధిక సంఖ్యలో రైతులు చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ఎకరా భూమి ఉన్న రైతులకు ఒక బస్తా, రెండు అంతకు మించి భూమి ఉన్న రైతులకు రెండు బస్తాలే ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతుల పాసుబుక్కు, ఆధార్‌కార్డు, భూమి వివరాలను పీఓఎస్ మిషన్‌లో నమోదు చేయడం, వేలిముద్ర, ఓటీపీ ఎంట్రీ చేయడంలో తీవ్ర జాప్యం జరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోకెన్ అభించడం ఆలస్యం కావడంతో రైతులు తమ చెప్పలను క్యూలైన్‌లో పెట్టి యూరియా కోసం నిరీక్షించారు. ఈ విషయమై సీఈఓ రాజేందర్ మాట్లాడుతూ యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని, నాలుగు రోజులకోమారు యూరియా వస్తుందన్నారు.