దూల్మిట్ట మండలం జాలపల్లిలో రైతుకు తెలియకుండానే పొలం నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. సమీప రైతులు ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇలా తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని రైతులు | - | Sakshi
Sakshi News home page

దూల్మిట్ట మండలం జాలపల్లిలో రైతుకు తెలియకుండానే పొలం నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. సమీప రైతులు ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇలా తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని రైతులు

Jun 14 2025 10:24 AM | Updated on Jun 14 2025 10:24 AM

దూల్మిట్ట మండలం జాలపల్లిలో రైతుకు తెలియకుండానే పొలం నుం

దూల్మిట్ట మండలం జాలపల్లిలో రైతుకు తెలియకుండానే పొలం నుం

మోయతుమ్మెద వాగు పరిసర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్నరీతిలో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు ట్రాక్టర్లు పోటాపోటీగా వెళ్తున్నాయి. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తోంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఇసుక తవ్వు తున్నారు. అధికారులకు తెలిసినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.

జోరుగా దందా

కోహెడ మండలంలోని మోయతుమ్మెద వాగులో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. వాగు పరిసర గ్రామాలైన తంగళ్లపల్లి, బస్వాపూర్‌, వింజపల్లి, రాంచంద్రాపూర్‌, వరికోలు.. అలాగే ఎల్లమ్మవాగు నకిరేకొమ్ముల, నారాయణపూర్‌, నంగనూరు మండలం ఖాతా, అక్కెనపల్లి, ఘన్‌పూర్‌, దూల్మిట్ట మండలం అర్జునపట్ల, జాలపల్లిలో ఈ దందా జోరుగా సాగుతోంది. రోజూ టన్నుల కొద్దీ ఇసుక హుస్నాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, హైదరాబాద్‌కు ట్రాక్టర్లు, బొలెరో, లారీల్లో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.4,500 నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. స్థానిక వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించడంలేదు. మామూళ్లకు అలవాటుపడి అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకేవరూ అడ్డు అన్నట్లుగా ఇసుక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత అధికారుల నుంచి సమాచారం వస్తే తప్ప ఇసుక డంప్‌లను సీజ్‌ చేయడం లేదని విశ్వసనీయ సమాచారం.

పలు చోట్ల వేలం పాట

పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలు మార్లు ఇసుక డంపులను సీజ్‌ చేస్తున్నారు. పలు చోట్ల వేలం పాట నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల వదిలేస్తుండటంతో అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి తరలిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక వాగుల సమీపంలో ఉన్న భూములలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

లోకల్‌ ఇసుకపై జీఓ 3 ప్రకారం స్థానిక తహసీల్దార్‌, పోలీస్‌లకు అధికారం ఉంటుంది. వాహనాల్లో తరలిస్తుంటే సీజ్‌ చేసే అధికారం మైనింగ్‌ శాఖకు ఉంది. ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నాం.

– లింగుస్వామి, ఏడీ, మైన్స్‌

దూల్మిట్ట మండలం జాలపల్లిలో ఇసుకను తవ్వుతూ ట్రాక్టర్లలో లోడ్‌ చేస్తున్న కార్మికులు

సీజ్‌ చేసిన వివరాలిలా..

కోహెడ పోలీసులు తంగళ్లపల్లి, అరేపల్లి గ్రామాల్లో ఏప్రిల్‌ నెలలో 95టన్నుల ఇసుక డంప్‌ను సీజ్‌ చేశారు. దీనిని తహసీల్దార్‌కు అప్పగించారు. మే 20న దూల్మిట్టలో 100ట్రాక్టర్ల ఇసుకను పట్టుకున్నారు. అలాగే జాలపల్లి, వీరబైరాన్‌పల్లిలలో ఇసుక డంప్‌లను ఇటీవల అధికారులు సీజ్‌ చేశారు. ఇలా పట్టుబడుతున్నా.. కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇసుకాసురులకు అవకాశంగా తీసుకుని ఇసుక దందాను కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement