ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకోవాలని..
చేర్యాల(సిద్దిపేట): మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఇటీవల ప్రమాదవశాత్తు జారిపడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ బీఆర్‌ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. స్థానిక 3వ వార్డు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు భూమిగారి రాజేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు చేర్యాల నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య ప్రారంభించారు. శనివారం ఉదయం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. పాదయాత్రగా వెళ్లిన వారిలో భూమిగారి విజయ్, పుట్ట యశ్వంత్, కల్లాటి విశ్వతేజ ఉన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పార్టీ చేర్యాల మండల అద్యక్షుడు అనంతుల మల్లేశం, నాయకులు నాచగొని వెంకటేష్, ఎర్రోళ్ల రామచంద్రం, పుర్మ వెంకట్‌రెడ్డి, మంచాల కొండయ్య. ఏర్పుల మహేష్ పాల్గొన్నారు.
చేర్యాల నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర


