ఆయిల్‌పాం సాగు లక్ష్యం చేరాలి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్ లో ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందునా జిల్లాకు ఇచ్చిన 6,500ఎకరాల లక్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలలో కలెక్షన్ సెంటర్ గుర్తించామని, మార్కుక్, హుస్నాబాద్ ప్రాంతాల్లో కూడా కలెక్షన్ సెంటర్ కోసం స్థల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. పెద్ద భూస్వాములనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్ పాం వైపు మళ్లించాలన్నారు. అంతకుముందుగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతుందని తెలిపారు. ఆయిల్‌పాం పంట 955 టన్నుల గెలలు కటింగ్ చేసి ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి పంపినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
అధికారులకు దిశానిర్దేశం


