
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఘుమఘుమలు
‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ వారోత్సవాలు
మిరుదొడ్డి(దుబ్బాక): ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీలు ఘుమ ఘుమలాడాయి. మిరుదొడ్డి, అక్బర్పేట–భూంపల్లి మండలాల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం వారోత్సవాలను ఉత్సాహంగా ప్రారంభించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎగ్ బిర్యానీ’లను ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి తయారు చేయనున్నారు. వారానికి రెండు సార్లు అందించనున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభమైన వారోత్సవాలను దుబ్బాక ఐసీడీఎస్ సూపర్వైజర్లు రేణుక, విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాలల్లో అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, పున్నమ్మ, రేణుక, రేణమ్మ, విజయలక్ష్మి, బుజ్జమ్మ, నర్సమ్మ, విజయరత్న, అనిత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఘుమఘుమలు

అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఘుమఘుమలు