
కొండపోచమ్మ బాగుంది
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను బుధవారం కోల్ ఇండియా ఉద్యోగుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం, అమలు చేసిన సాంకేతికత, ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఏఈఏలు శ్రీనివాస్, శుశాంత్.. బృందం సభ్యులకు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరును, ప్రస్తుతం రైతుల పంట పొలాలకు కాల్వల ద్వారా నీటిని ఏ విధంగా వదులుతున్నామనే విషయాలను వారికి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం బాగుందని వారు కితాబిచ్చారు.
కోల్ ఇండియా ఉద్యోగుల బృందం కితాబు