
భూ కొలతల సమస్యలు తీర్చేందుకే..
సిద్దిపేటఎడ్యుకేషన్: భూ కొలతల సమస్యలు పరిష్కరించేందుకే లైసెన్సు సర్వేయర్లను నియమిస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో లైసెన్సు సర్వేయర్లుగా ఎంపికై న వారికి ల్యాండ్ సర్వే రికార్డ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్ల సేవల అవసరం అన్నారు. ప్రస్తుతం సర్వేయర్ల కొరత ఉన్నందున అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి రెండు నెలలు శిక్షణ ఇప్పించి లైసెన్స్ సర్వేయర్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. భూ కొలతల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండడం వల్ల కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి అధిక దరఖాస్తులు భూ సంబంధించినవే వస్తున్నాయన్నారు. మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూమి కొలతల విధానాలను, భూమి కొలతల్లో వాడే పరికరాల ఉపయోగాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలన్నారు. ఫీల్డ్‌లో ప్రాక్టికల్స్ చేసి నైపుణ్యం గల సర్వేయర్లుగా సిద్ధం కావాలన్నారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారికి సర్వే మెటీరియల్ కిట్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందం, ఏడీ ల్యాండ్ సర్వే వినయ్ కుమార్ పాల్గొన్నారు.
u