సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ | - | Sakshi
Sakshi News home page

సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ

May 27 2025 7:36 AM | Updated on May 27 2025 7:36 AM

సీపీన

సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ

గజ్వేల్‌రూరల్‌: ఏసీపీగా బదిలీపై వచ్చిన కె.నర్సింహులు సోమవారం సిద్దిపేటలో సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడటంతో పాటు గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల నిరోధంపై దృష్టి సారించాలన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే.. గజ్వేల్‌ ఏసీపీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన పురుషోత్తంరెడ్డికి సిబ్బంది వీడ్కోలు పలికారు.

బాల సాహితీవేత్తలకు పురస్కారాలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బాల సాహిత్య సమ్మేళనంలో సిద్దిపేటకు చెందిన కవులు పురస్కారాలు అందుకున్నారని బాల సాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖ కవులు పెందోట వెంకటేశ్వర్లు, ఎన్నవెల్లి రాజమౌళీలకు నిర్వహకులు పురస్కారాలు అందించారన్నారు. పెందోట వెంకటేశ్వర్లు రచించిన ‘చెప్తే సగం ఇవ్వాలి’ అనే పుస్తకాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారన్నారు.

మల్బరీ సాగుకు ప్రోత్సాహం

పట్టుపరిశ్రమ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): మల్బరీ, పట్టు పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం ఇటిక్యాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 403 కుటుంబాలు మల్బరీ సాగు చేపడుతున్నాయని, ప్రతి నెలా రూ.50 వేల నుంచి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని వివరించారు. జిల్లాలో 1,127 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతోందన్నారు. మల్బరీ తోటలో ఉత్పత్తి చేసి పట్టు గూళ్ల ద్వారా ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని వివరించారు. మల్బరీ సాగు చేసే రైతులకు రాయితీ ఉందని, ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం, మిగతా వారికి 50 శాతం రాయితీ అవకాశం ఉందన్నారు. ఈ అవకాశానని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టు పరిశ్రమ ఏఓ మల్లేశం, కార్యదర్శి రేఖ, రైతులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే

పీడీ యాక్ట్‌

గజ్వేల్‌: నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని ఏడీఏ బాబునాయక్‌ హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌ పట్టణంలోని పలు విత్తనాలు, ఫర్టిలైజర్‌ దుకాణాల్లో వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్‌ కలిగిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రతి దుకాణంలో ధరల పట్టిక అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు విధిగా రశీదు ఇచ్చి అందులో రైతుల సంతకం తీసుకోవాలన్నారు. నిబంధనలను పాటించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.

సీపీ అనురాధకు మొక్కను అందిస్తున్న గజ్వేల్‌ ఏసీపీ నర్సింహులు

సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ 1
1/2

సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ

సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ 2
2/2

సీపీని కలిసిన గజ్వేల్‌ ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement