
పలువురు డీఎస్పీల బదిలీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కూడా బదిలీలు జరిగాయి.
● జహీరాబాద్ డీఎస్పీ కె.రామ్మోహన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నల్లగొండ జిల్లా డీసీఆర్‌బీ డీఎస్పీగా పనిచేస్తున్న బి.సైదాను జహీరాబాద్ డీఎస్పీగా నియమించింది.
● పటాన్‌చెరు డీఎస్పీ పి.రవీందర్‌రెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌రూంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎస్.ప్రభాకర్‌కు పటాన్‌చెరు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.
● మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని సైదాబాద్ ఏసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూం ఏసీపీగా ఉన్న జే.నరేందర్‌గౌడ్‌కు తూప్రాన్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.
● సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీఎస్పీగా పనిచేస్తున్న పురుషోత్తంరెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్న కె.నర్సింలుకు గజ్వేల్ డీఎస్పీగా నియమితులయ్యారు.
● సిద్దిపేట ఏసీపీ జి.మధును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డి నియమించారు.
● సిద్దిపేట డీసీఆర్‌బీ ఏసీపీ శంకర్‌రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా నియమించారు.
● హుస్నాబాద్ డీఎస్పీ వి.సతీష్‌కు జీడీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎస్.సదానందంను నియమించారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.