కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి పొన్నం లేఖ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి పొన్నం లేఖ

May 6 2025 10:05 AM | Updated on May 7 2025 12:15 PM

నాలుగు లేన్ల రోడ్డుగా మార్చాలంటూ వినతి

హుస్నాబాద్‌: కేంద్ర జాతీయ రహదారులు, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ రాశారు. హుస్నాబాద్‌ నుంచి జనగామ వరకు డబుల్‌ లేన్‌ రోడ్డుగా ఉన్న 52 కి.మీ. రహదారిని నాలుగు లేన్లుగా అప్‌గ్రేడేషన్‌ చేయాలని లేఖలో కోరారు. జిల్లా రోడ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ నేషనల్‌ హైవే రోడ్డుగా మార్చడం వల్ల హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి పొన్నం లేఖలో పేర్కొన్నారు.

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్‌ మనుచౌదరి

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వెయిట్‌ మిషీన్లు, ప్యాడిక్లీనర్లను పరిశీలించారు. 

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం తడవకుండా టార్పాలిన్‌ షీట్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తేమశాతం రాగానే వెంటనే లోడ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సివిల్‌ స్లప్లై డీఎం ప్రవీన్‌ తదితరులు ఉన్నారు.

ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మద్దూరు(హుస్నాబాద్‌): మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన్నుట్లు ప్రిన్సిపాల్‌ అందె గణేశ్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని అన్నారు.

నేరుగా ప్రవేశాలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, గురుకులాల్లో ఇంటర్‌ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నారు. మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో నేరుగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ మహాదేవుని శివప్రసాద్‌ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కల్గిన విద్యార్థులు ఈనెల 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

నేల తల్లి ఆరోగ్యం కాపాడండి : శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి

హుస్నాబాద్‌: యూరియా వాడకాన్ని తగ్గించి నేత తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.శ్రీదేవి పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సాగు పద్ధతులు, వారిని వానాకాలం సాగుకు సమాయత్తం చేసేందుకు ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తోర్నాల ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసిన రశీదులను రైతులు భద్రపర్చుకోవాలన్నారు. సాగునీటిని ఆదాచేసే పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పంటల వివరాలు, చెట్ల పెంపకంపై వివరించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫోన్‌ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు సాగు ఖర్చును తగ్గించుకొని వ్యవసాయంలో శాసీ్త్రయ మెలకువలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, డివిజన్‌ వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, శాస్త్రవేత్త పల్లవి, వ్యవసాయ పాలిటెక్నిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాజా, డైరెక్టర్లు పాల్గొన్నారు.

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి1
1/1

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement