
సత్తాచాటిన పేదింటి కుసుమాలు
మోడల్‌లో మెరిసిన విద్యార్థులు
ఆటో డ్రైవర్ కుమారుడు టాపర్
దుబ్బాకటౌన్: ఆటో డ్రైవర్ కుమారుడు మండల టాపర్‌గా నిలిచారు. బుధవారం ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో హరీశ్ సత్తా చాటాడు. అక్బర్‌పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు చెందిన ఆటో డ్రైవర్ పుస్కూరి లక్ష్మణ్, లావణ్య దంపతుల కుమారుడు హరీశ్ దుబ్బాక ప్రభుత్వ మైనార్టీ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. ఫలితాల్లో 573 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తనని మండల టాపర్‌గా నిలిపిందని హరీష్ చెప్పారు.
పేదింటి చేనేత విద్యార్థి ప్రతిభ
దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11 వార్డు చేనేత కుటుంబానికి చెందిన సబ్బాని దీపక్ టెన్త్ ఫలితాల్లో సత్తాచాటాడు. తండ్రి సబ్బాని శ్రీరాం ప్రసాద్ దర్జీగా, తల్లి మాధవి బీడీలు చుడుతూ.. ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. దీపక్ లచ్చపేట మోడల్ స్కూల్లో 10వ తరగతి చదివాడు. 562 మార్కులు సాధించి మండల ద్వితీయ టాపర్‌గా నిలిచాడు. దీంతో పలువురు దీపక్‌ను అభినందించారు.
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని పలు ప్రభుత్వ బడులతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలు టెన్త్‌లో వంద శాతం ఫలితాలు సాధించాయి. మండల వ్యాప్తంగా అర్జునపట్ల, కడవేర్గు, తాడూరు, వీరన్నపేట, గుర్జకుంట, పెద్దరాజుపేట పోతిరెడ్డిపల్లి పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మోడల్ స్కూల్‌కు చెందిన కొల్పుల భానుతేజ అనే విద్యార్థిని 564 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే అదే పాఠశాలకు చెందిన రంగు రాహుల్ 555, పుట్ట అమూల్య 555 మార్కులు సాధించారు.

సత్తాచాటిన పేదింటి కుసుమాలు

సత్తాచాటిన పేదింటి కుసుమాలు

సత్తాచాటిన పేదింటి కుసుమాలు

సత్తాచాటిన పేదింటి కుసుమాలు