
వర్గల్ క్షేత్రం.. భక్తిపారవశ్యం
వర్గల్(గజ్వేల్): శనిత్రయోదశి మహోత్సవ వైభవంతో వర్గల్ శ్రీవిద్యాసరస్వతి శనేశ్వర క్షేత్రం అలరారింది. తైలాభిషేకాలకు తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున శనిత్రయోదశి వేడుకలకు అంకరార్పణ జరగగా, ఆలయ మహామండపంలో భక్తుల సామూహిక శనేశ్వర పూజలు కొనసాగాయి. అనంతరం భక్తులు ఒక్కొక్కరుగా మూలవిరాట్టుకు తిల తైలం సమర్పించి, శుభాలు చేకూర్చా లని ప్రార్థించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే క్షేత్రంలోని చంద్రమౌళీశ్వర స్వామికి మాస శివరాత్రి సందర్భంగా విశేషా భిషేకం అనంతరం అన్నపూజ నిర్వహించారు.
శనిత్రయోదశి వైభవం
శనేశ్వరునికి తిల, తైలాభిషేకం