
రంగనాయకసాగర్, తపాస్‌పల్లి కాలువలను కలపండి
మద్దూరు(హుస్నాబాద్): భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం చేర్యాల మండల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలను సందర్శించారు. రంగనాయకసాగర్ ఎల్‌డీ–10, తపాస్‌పల్లి డీ–3 కాలువలను పరిశీలించారు. రంగనాయకసాగర్ కాలువలో సాగునీరు ఉండగా, తపాస్‌పల్లి కాలువలో మాత్రం సాగునీరు లేకపోవడాన్ని గుర్తించారు. ఇదేవిఽషయాన్ని తపాస్‌పల్లి కాలువ నీటితో సాగు చేసే రైతులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే రంగనాయకసాగర్ కాలువ, తపాస్‌పల్లి కాలువలను కలిపే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఫోన్ ద్వారా నీటిపారుదలశాఖ అధికారులకు సూచించారు. కాలువలకు ఇరువైపుల ఉన్న రైతులు ఇదేవిఽషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఐదు గ్రామాల పరిధిలో 12వేల సాగు ఉంటుందని, ఈ కాలువలతో సాగు స్థిరీకరణ అయ్యే విధంగా కృషి చేస్తానన్నారు.