విద్యార్థులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అభినందనలు

Mar 4 2025 7:10 AM | Updated on Mar 4 2025 7:10 AM

విద్య

విద్యార్థులకు అభినందనలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): అలయన్స్‌ క్లబ్‌ ఆన్‌లైన్‌లో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సైన్స్‌ క్విజ్‌ పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు రాణించారని ఆ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ కమిటీ చైర్మన్‌ ఆత్మరాములు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూనియర్స్‌ విభాగంలో దీకొండ అభివర్ధన్‌, శిరిస్తా ప్రథమ స్థానంలోను, సీనియర్‌ విభాగంలో విశ్వేశ్వర్‌, సుభిక్ష తృతీయ స్థానంలోను నిలిచారన్నారు. విజేతలకు రూ.25వేల నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. సుజాత, బాలచంద్రం, సుజన, వెంకట్‌లక్ష్మి తదితరులు విద్యార్థులను అభినందించారు.

సైన్స్‌పై అవగాహన అవసరం

హుస్నాబాద్‌: విద్యార్థులు స్కూల్‌ స్థాయి నుంచే సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని మండల విద్యాధికారి బండారి మనీల అన్నా రు. స్థానిక సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్‌లో సోమవారం సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. వివిధ అంశాల పై 400లకు పైగా ప్రయోగాల నమోనాలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆవిష్కరణపై ఆసక్తిని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ శివయ్య, ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్‌లోని గట్టు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. గత 26 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి. అర్చకులు, కమిటీ సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణ మహోత్సవం, పెద్దపట్నం, భద్రకాళి అమ్మవారి పూజ, అగ్నిగుండ ప్రవేశంతో బ్రహ్మోత్సవాలను సోమవారం ముగించారు. సిద్దిపేట, జనగాం, హన్మకొండ, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆర్థిక సాయం అందజేత

గజ్వేల్‌రూరల్‌: చికిత్స పొందుతున్న పలువురికి ఆపన్న హస్త మిత్రబృందం సోమవారం చేయూతనందించింది. పట్టణానికి చెందిన నితిన్‌, చేర్యాల మండలం కడవెరుగు గ్రామానికి చెందిన శ్రీరాములు ఆర్‌వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు ఆర్‌వీఎం ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. నితన్‌ కుటుంబ సభ్యులకు రూ.20 వేలు, శ్రీరాములు కుటుంబ సభ్యులకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో బాల్‌చంద్రం, శ్రీనివాస్‌, శ్యామ్‌ప్రసాద్‌, స్వామి, సాయి, రాజు, రాజేశం, కనకయ్య, బాల్‌నర్సు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా

పెద్దమ్మ తల్లి బోనాలు

సిద్దిపేట రూరల్‌: మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డి పల్లిలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల నృత్యాల నడుమ బోనాల ఊరేగింపు కొనసాగింది. పెద్దమ్మ తల్లి నామస్మరణతో పల్లెలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో సంఘం సభ్యులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందనలు 
1
1/3

విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులకు అభినందనలు 
2
2/3

విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులకు అభినందనలు 
3
3/3

విద్యార్థులకు అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement