ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మాల జంగం మహేశ్వర సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఆదివారం సిద్దిపేటలో ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర రాజలింగం అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎర్పుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా సదానందం, గురుమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా ఎన్నం రాజు, ప్రధాన కార్యదర్శిగా అల్లం పరమేశ్, కోశాధికారిగా లింగం, కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా రాజు, రాజేశ్వర్, శివకుమార్, దేవరాజు, పరమేశ్వర్ కార్యవర్గ సభ్యులుగా శంకర్, శివలింగం, సత్యం, ఈశ్వరయ్య, ప్రవీణ్, కాశిలింగం, సోమలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.