ఎల్‌పీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత లచ్చపేట | - | Sakshi
Sakshi News home page

ఎల్‌పీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత లచ్చపేట

Mar 3 2025 7:07 AM | Updated on Mar 3 2025 7:07 AM

ఎల్‌పీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత లచ్చపేట

ఎల్‌పీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత లచ్చపేట

దుబ్బాకటౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని లచ్చపేటలో తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ దంత వైద్యశాల సహకారంతో నిర్వహించిన లచ్చపేట ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం ఉత్కంఠగా సాగింది. దుబ్బాక మార్నింగ్‌ క్రికెట్‌ ఫ్రెండ్స్‌(ఎంసీఎఫ్‌), లచ్చపేట జట్లకు ఫైనల్‌ మ్యాచ్‌ జరగ్గా పది పరుగుల తేడాతో లచ్చపేట జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లచ్చపేట జట్టు నిర్ణిత 16 ఓవర్‌లలో 159 పరుగులు చేసింది. ఎంసీఎఫ్‌ టీం పది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నెల రోజులుగా సాగుతున్న ఈ టోర్నీలో దాదాపు 35 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ రూ.12,100 నగదు బహుమతితోపాటు ట్రోఫీ, రన్నర్‌ జట్టుకు రూ.7,100 నగదు బహు మతి అందించారు. కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపనాల్‌ బుచ్చిబాబు, నాయకులు శ్రీకాంత్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, సతీశ్‌గౌడ్‌, కిషన్‌, అరుణ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement