
గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి
సిద్దిపేటజోన్: జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బుధవారం ఐదో రోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 12 నామినేషన్లు, దుబ్బాకలో 05, గజ్వేల్‌లో 25 నామినేషన్లు, హుస్నాబాద్‌లో 6 నామినేషన్లు వచ్చాయి. హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి, సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి హరికృష్ణ నామినేషన్లు వేశారు.
దుబ్బాకలో ఐదు..
దుబ్బాకటౌన్: దుబ్బాకలో బుధవారం ఐదు నామినేషన్లు దాఖలు అయినట్లు ఆర్‌ఓ గరీమ అగ్రవాల్ తెలిపారు. జక్కుల వెంకట్ (స్వతంత్ర), వేముల వెంకట ప్రసన్న(ధర్మ సమాజ్ పార్టీ), దండ్ల నరేష్ (స్వతంత్ర), పెద్దలింగన్నగారి ప్రసాద్ (స్వతంత్ర), గౌటి మల్లేశ్ (రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ) నామినేషన్లు వేశారని తెలిపారు.
గజ్వేల్‌లో 25..
గజ్వేల్: అసెంబ్లీ స్థానానికి బుధవారం 25 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బన్సీలాల్ తెలిపారు. ఇందులో భాగంగా తూంకుంట నర్సారెడ్డి (కాంగ్రెస్), మాధవరెడ్డి, వరికోలు శ్రీనివాస్, రానవేని లక్ష్మణ్, పల్లె మానిక్‌ప్రభు, కిన్నెర యాదయ్య, ఫారూక్ అహ్మద్ హసన్ మహ్మద్, ముఖేష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బొల్లెన పాండు, ఽముక్కెర కృష్ణ, దాసరి భానుచందర్, వడ్డెపల్లి కరుణాకర్, నిఖిల్‌రెడ్డి, జూపల్లి ముత్యాలు, రమేష్‌కుమార్, బెల్లపురం సతీష్‌కుమార్, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, మామిడి నారాయణరెడ్డి, లింబారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. దుబ్బాక బుగ్గరాజు(ధర్మ సమాజ్ పార్టీ), నేలపాటి నాగరాజు(విద్యార్థుల రాజకీయ పార్టీ), నీరుడి ప్రసాద్(బ్లూ ఇండియా పార్టీ), గుండ ప్రభాకర్‌రెడ్డి(అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ), భూంపల్లి కిశోర్(భారతీయ స్వదేశీ కాంగ్రెస్) నామినేషన్ వేశారు.