
● లింగన్న కుటుంబానికి అండగా ఉంటా.. ● మంత్రి హరీశ్‌రావు ● దుబ్బాకలో రామలింగారెడ్డి విగ్రహం ఆవిష్కరణ
దుబ్బాకటౌన్: నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగిన దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డిది వైవిధ్యమైన జీవితమని.. చివరి వరకు ప్రజల కోసం పరితపించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన రామలింగారెడ్డి విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సోలిపేట సతీమణి సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డితో పాటు వేలాది మంది అభిమానులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. శ్రీమేము జోడెడ్ల లాగా పని చేశాం.. ఇలా నేను లింగన్న విగ్రహం ఆవిష్కరిస్తా అని కలలో కూడా ఊహించలేదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో జరిగిన రాళ్ల యుద్ధంలో నేను లింగన్న పక్కనే ఉన్నా.. బుల్లెట్ల వర్షం కరిసినప్పుడు భయపడితే ధైర్యం చెప్పిండు అన్నారు. మానుకోటలో ఉద్యమకారుడికి బుల్లెట్ తగిలితే లింగన్న కారులోనే తీసుకెళ్లామని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. విప్లవకారుడిగా, జర్నలిస్టుగా, ఎమ్మెల్యేగా లింగన్న జీవితమంతా పేదల కోసమే పనిచేశారన్నారు.
రాజకీయంగా నిలబెడతా....
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అతి సాధారణ జీవితం గడిపిన లింగన్న అసెంబ్లీలో సైతం పేదల పక్షానే నిలిచేవారని..లింగన్న కుటుంబానికి అండగా ఉంటా.. రాజకీయంగా నిలబెడతా అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
బీఆర్‌ఎస్‌లో ఉంటాం: సుజాతక్క, సతీష్‌రెడ్డి
మా జీవిత కాలమంతా బీఆర్‌ఎస్‌లోనే ఉంటామని రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క, కుమారుడు సతీష్‌రెడ్డి అన్నారు. తాను దుబ్బాక టికెట్ కోసం కొట్లాడింది నిజమే..అధినేత సూచనల మేరకు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఎంపీ ప్రభాకరన్నను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించేందుకు లింగన్న అభిమానులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె వనిత, ఎంపీపీ పుష్పలత, జెడ్పీటీసీ రవిందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
పారదర్శక పాలన
దుబ్బాకటౌన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన అందిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో రూ.17 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐఓసీ)ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందన్నారు.

దుబ్బాకలో ఐఓసీని ప్రారంభిస్తున్న మంత్రి, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు