
కొమురవెల్లి పరిసరాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్
వర్గల్(గజ్వేల్): శ్రీరామనవమి వేడుకలకు నా చగిరి క్షేత్రంలోని శ్రీరామాలయం ముస్తాబైంది. గురువారం శ్రీసీతారామచంద్రమూర్తి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. క్షేత్రంలోని శ్రీరామాలయంలో ఉద యం 10.30 గంటలకు కల్యాణోత్సవం జరుగుతుంది. భక్తులు తరలిరావాలని ఆలయ సహాయ కమిషనర్ కట్టా సుధాకర్‌రెడ్డి కోరారు.
నేటి నుంచి సిటీ పోలీస్‌యాక్ట్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు.
మేథోకిట్‌ల పంపిణీ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మేథో దివ్యాంగులకు మేథో కిట్‌లను డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేఽశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భవిత సెంటర్‌లో ఎన్‌ఐఈపీఐడీ (జాతీయమేథో దివ్యాంగ వ్యక్తుల సాధికార సంస్థ) ఆధ్వర్యంలో జిల్లాలోని 37 మంది మేథో దివ్యాంగ విద్యార్థులకు ఈ కిట్‌లు అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి కిట్ విలువ రూ.10వేలు ఉంటుందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, రంగనాథ్, హృషీకేశ్, లక్ష్మణ్, సురేష్, సురేష్, విష్ణుప్రసాద్, యాదగిరి, కరుణాకర్ , హరిత, సుమలత, మంగమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ ఉపయోగిస్తే
చర్యలు తప్పవు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పరిసరాల్లోని వ్యాపార సముదాయాల్లో ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవని జిల్లా అదనపుకలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ అన్నారు. బుధవారం డీపీఓ దేవికాదేవితో కలసి వ్యాపారస్తులు, హోటల్ యజమానులకు ప్లాస్టిక్ వాడకంవల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పరిసరాల్లో పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లను నిషేధించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ వాహనానికి అందజేయాలన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. స్వచ్ఛహరిత కొమురవెల్లిగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ విక్రయించే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ అనురాధ, ఎంపీఓ మంజులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఉపసర్పంచ్ సార్ల కిష్టయ్య, అడిషనల్ పీడీ కౌసల్య, చెన్నారెడ్డి, లోకేష్ పాల్గొన్నారు.

కిట్‌లు పంపిణీ చేస్తున్న డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
