
మంత్రి హరీశ్‌రావును సన్మానిస్తున్న పీఆర్టీయూ జిల్లా నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యా సంస్థలకు కేంద్రంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాకు పదో తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పీఆర్టీయూ నాయకులు మంత్రి హరీశ్‌రావుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధర్‌శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయులు 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి సంగారెడ్డి జిల్లాకు వెళ్లి మూల్యాంకనం చేసేవారని, ప్రస్తుతం ఆ బాధ తప్పిందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆదరసుపల్లి శశిధర్‌శర్మ, ప్రధాన కార్యదర్శి పంత వెంకటరాజం పాల్గొన్నారు.
సిద్దిపేట హైటెక్ సిటీగా ఎన్సాన్‌పల్లి
సిద్దిపేటఅర్బన్: హైదరాబాద్ హైటెక్ సిటీలా సిద్దిపేట ఎన్సాన్‌పల్లి మారుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఆయనతో సర్పంచ్ రవీందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం, ఎంపీటీసీ స్రవంతి, దేవాలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు