
గంగిరేణి చెట్టు ప్రాంగణంలో భక్తుల కోలాహలం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆలయానికి చేరుకున్న భక్తులు పుణ్యస్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్తంభం వద్ద కోడెను కట్టి స్వామి మా వారిని వేడుకున్నారు,. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శిచుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ఈఓ బాలాజీ, ఏఈఓ అంజయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేడు హుండీ లెక్కింపు
స్వామి వారి హుండీని నేడు లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ బాలాజీ తెలిపారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపడతామన్నారు.