మరిచిపోయిన ఆభరణాల బ్యాగు అందజేత | - | Sakshi
Sakshi News home page

మరిచిపోయిన ఆభరణాల బ్యాగు అందజేత

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

హుస్నాబాద్‌: ఎల్లమ్మ జాతరకు వచ్చిన ఓ భక్తురాలు మరిచిపోయిన బ్యాగ్‌ను ఆలయ డైరెక్టర్లు తిరిగి అందజేశారు. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన గంప మౌనిక అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. తన వెంట తెచ్చుకున్న బ్యాగును గర్భగుడిలోనే మరిచిపోయింది. బ్యాగును గమనించిన ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది బ్యాగు ఓపెన్‌ చేయగా, అందులో 15 తులాల బంగారం, రూ.15వేల నగదును గుర్తించారు. దాదాపు 2 గంటల తర్వాత సదరు మహిళ బ్యాగు పోయిందని ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలుసుకొని బ్యాగు అమెదేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పగించారు. ఆలయ అర్చకుడు పరమేశ్వర్‌ శర్మ, నిర్వాహకులు ప్రభాకర్‌, టాకూర్‌ భగవాన్‌ సింగ్‌, వెంకటస్వామి, రాజిరెడ్డి, కిషన్‌ నాయక్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement