ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రేమ విఫలమైందని కలత చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రామునిపట్లలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కర్రె లచ్చవ్వ , జయరావు దంపతులకు నలుగురు కుమారులు. 20 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేస్తూ నలుగురిని పోషించింది. చిన్న కుమారుడు కర్రె వంశీకృష్ణ(32) సిద్దిపేట పట్టణంలోని బైక్‌ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఓ యువతితో పరిచయం ఏర్పడి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఇద్దరి మద్య మనస్పర్దలు ఏర్పడి యువతి వివాహానికి నిరాకరించింది. దీంతో వంశీకృష్ణ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం కుటుంబీకులు లేచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement