వ్యసనాలకు లోనవ్వద్దు | - | Sakshi
Sakshi News home page

వ్యసనాలకు లోనవ్వద్దు

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి

సంగారెడ్డి జోన్‌: చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..నేటి యువత రేపటి సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని చెడు వ్యసనాలకు లోనై జీవితాలను మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్‌ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. బాధిత మహిళలకు సఖీ కేంద్రం, భరోసా కేంద్రాలు అండగా పనిచేస్తున్నాయని పేర్కొ న్నారు. విద్యాసంస్థలు, పని ప్రదేశాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్‌లైన్‌ నంబర్లు 100, 112, 1930, 1098 లేదా జిల్లా షీ టీమ్‌ నంబర్‌ 8712656772 కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ప్రకాశ్‌రావ్‌, సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement