మతసామరస్యానికి ప్రతీక ఉర్సు: మంత్రి దామోదర
రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి
ఎస్పీ పరితోశ్‌పంకజ్
సంగారెడ్డి జోన్: రాష్ట్రస్థాయిలో నిర్వహించే క్రీడా పోలీస్ మీట్‌లో జిల్లా అధికారులు తమ సత్తా చాటి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరచి త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తున్న వారికి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ట్రాక్ సూట్స్, టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీసులు విధి నిర్వహణతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శాఖాపరంగా గుర్తింపుతోపాటు ప్రోత్సాహం అందుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఆశన్నగౌడ్
సంగారెడ్డి టౌన్: కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న నిరాహారదీక్ష నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని గీత కార్మికులు, గౌడ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం గీత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, బడ్జెట్లో ఉపాధి కోసం రూ.5 వేల కోట్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన
న్యాల్‌కల్ (జహీరాబాద్): స్థానిక ప్రైవేటు హైస్కూల్‌లో సోమవారం ఉదయం సీపీఆర్‌పై స్థానిక వైద్యులు డాక్టర్ జైన్ అమృత్‌రాజ్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటుతో శ్వాస ఆగిపోయిన వారిని రక్షించేందుకు సీపీఆర్ నిర్వహిస్తే బ్రతికే అవకాశం ఉందన్నారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం వల్ల శ్వాస ఆగిపోయిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారని, అలా చేయకుండా వెంటనే సీపీఆర్ చేస్తే శ్వాస వచ్చే అవకాశం ఉందన్నారు. సీపీఆర్ చేయకముందు 108కు తప్పనిసరిగా కాల్ చేయాలని సూచించారు.
మతసామరస్యానికి ప్రతీక ఉర్సు: మంత్రి దామోదర
మతసామరస్యానికి ప్రతీక ఉర్సు: మంత్రి దామోదర
మతసామరస్యానికి ప్రతీక ఉర్సు: మంత్రి దామోదర


