కమనీయం శివపార్వతుల కల్యాణం
పోతిరెడ్డిపల్లి లో సంగమేశ్వర
స్వామి వారి కల్యాణ వేడుక
బుదేరాలో మల్లిఖార్జునస్వామి కల్యాణం
శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్న ప్రధాన పూజారి
జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణం ఆదివారం రాత్రి కనులపండువగా జరిగింది. మునిపల్లిలోని బుదేరా గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవతామూర్తుల వివాహమహోత్సవం, జహీరాబాద్‌లోని అల్గోల్ రోడ్డులోని శ్రీసిద్ధేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం, సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో కేతకీ సంగమేశ్వరస్వామి వారి కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య అంగరంగవైభవంగా ఆలయనిర్వాహకులు జరిపించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం వితరణ చేశారు.
మునిపల్లి(అందోల్)/సంగారెడ్డి టౌన్/జహీరాబాద్ టౌన్ :
కమనీయం శివపార్వతుల కల్యాణం
కమనీయం శివపార్వతుల కల్యాణం
కమనీయం శివపార్వతుల కల్యాణం


