కోరమ్‌ లేక ఎన్నిక వాయిదా | - | Sakshi
Sakshi News home page

కోరమ్‌ లేక ఎన్నిక వాయిదా

Feb 17 2026 8:53 AM | Updated on Feb 17 2026 8:53 AM

కోరమ్‌ లేక ఎన్నిక వాయిదా

కోరమ్‌ లేక ఎన్నిక వాయిదా

నిలిచిన జహీరాబాద్‌,ఇంద్రేశం చైర్మన్ల ఎన్నిక బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లతోవచ్చిన ఎమ్మెల్యే మాణిక్‌రావు గైర్హాజరైన కాంగ్రెస్‌, ఎంఐఎం,స్వతంత్ర కౌన్సిలర్లు

జహీరాబాద్‌: జహీరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల ఎన్నిక నిర్వహణ కోసం తగినంత కోరమ్‌ లేని కారణంగా మంగళవారానికి వాయిదా పడింది. ఎన్నికలను సోమవారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా..బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు ప్రత్యేక క్యాంపు నుంచి బస్సులో నేరుగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు వారిని వెంట పెట్టుకుని తరలివచ్చారు. మున్సిపాలిటీలో 37 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్‌ఎస్‌కు 15, బీజేపీ ముగ్గురు సభ్యులున్నారు. ఎన్నిక నిర్వహణకు మ్యాజిక్‌ ఫిగర్‌ 19 కాగా, ఇరు పార్టీలకు చెందిన వారు కలిపి18 మంది సభ్యులే ఉన్నారు. తగినంత కోరమ్‌ వచ్చాక ఎన్నిక నిర్వహించాలని అధికారులు కాంగ్రెస్‌, ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల రాక కోసం ఎదురు చూశారు. అయినా వారెవరూ మున్సిపల్‌ కార్యాలయానికి హాజరుకాకపోవడంతో ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే మాణిక్‌రావు బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక బస్సులో తిరిగి ప్రత్యేక క్యాంపునకు వెళ్లి పోయారు.

ఇంద్రేశంలోనూ వాయిదా..

పటాన్‌చెరు టౌన్‌: ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక కోరమ్‌ లేని కారణంగా మంగళవారానికి వాయిదా పడింది. ఉదయం 11గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఉంటుందని సభ్యులందరూ సకాలంలో హాజరుకావాలని ఎన్నికల ప్రత్యేక అధికారి రామాచారి సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

చైర్మన్‌ పదవి బీఆర్‌ఎస్‌కే

దక్కుతుంది : ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ..నిర్ణయించిన సమయానికి తమ కౌన్సిలర్లు హాజరయ్యారని ఇచ్చిన సమయం వరకు ఇతర పార్టీల వారు రాకపోవడంతో వాయిదా వేశారని చెప్పారు. తమకు చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉన్నందున వారు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement