మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
జిన్నారం (పటాన్‌చెరు): పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం గడ్డపోతారం పట్టణ పరిధిలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు, అలాగే.. జిన్నారం పట్టణ పరిధిలోని రాళ్లకత్వ, రాళ్లకత్వ తండాలలో రూ.95 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు అంతర్గత మురుగునీటి కాల్వలు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మహా పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్లు వెంకటరామయ్య, తిరుపతి, పంచాయితీరాజ్ డీఈ సురేష్ పాల్గొన్నారు.


