నాడు తనయుడు.. నేడు తల్లి
సర్పంచ్ పీఠంపై
ఏటిగడ్డ మాందాపూర్ గ్రామం ఏకగ్రీవం
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన ఎర్రోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించి సర్పంచ్ పీఠం అధిరోహించారు. ఈసారి ఎన్నికల్లో ఈ సర్పంచ్ స్థానం జనరల్ (మహిళ)కు కేటాయించారు. మొదట అన్ని పార్టీలు అభ్యర్థులను బరిలో ఉంచాలనుకున్నప్పటికీ గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, పార్టీలకు అతీతంగా విష్ణువర్ధన్ రెడ్డి తల్లి విజయమ్మను నామినేషన్ వేయించి ఏకగ్రీవం చేశారు. ఇక్కడి ఎనిమిది వార్డులు సైతం ఏకగ్రీవం కావడం గమనార్హం. అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.


