ఆడపిల్ల పుడితే రూ.5,116
● 18 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ● ఘనాపూర్ సర్పంచ్ అభ్యర్థి హామీ
కొల్చారం(నర్సాపూర్): గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురి పిస్తున్నారు. మండలంలోని చిన్న ఘనాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి చందా పురం మధుసూదన్ రెడ్డి.. గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే ఆ బిడ్డ తల్లి పేరుతో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసులో రూ.5,116 ఫిక్స్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పథకం డిసెంబర్ 18 నుంచి అమలవుతుందని, 18 ఏళ్లు వచ్చేవరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని ప్రచారంలో చెప్పారు.
ముద్దాపూర్ సర్పంచ్ అభ్యర్థి సైతం..
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థి తూం శ్రీకాంత్ ఓటరుల ను ఆకుట్టుకునేలా వినూ త్న నజరానా ప్రకటించారు. గ్రామ పంచాయతీ బీసీ జనరల్ కోటాలో రిజర్వుకాగా 451 మంది ఓటరులున్నారు. ఎన్నికల్లో సర్పంచ్‌గా ఆశీర్వదించి అవకాశమిస్తే పదవీ కాలం పూర్తయ్యే వరకు గ్రామంలో కుల, మతాలకు అతీతంగా ఆడపిల్ల పుట్టిన వెంటనే పాప పేరిట రూ.5,116 బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ పత్రాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తానని ప్రకటించారు. దీంతో పాటు పేద కుటుంబాల్లో ఆపద వచ్చినప్పుడు తమ వంతుగా రూ.5 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకున్నారు.
గ్రామాభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తా..
చేర్యాల(సిద్దిపేట): తనను సర్పంచ్‌గా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కోరాడు. పదవి చేపట్టిన తరువాత తన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి అక్రమ ఆస్తులు పెరిగినా, గ్రామ పంచా యతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చని, మండల పరిధిలోని తాడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొడిగె నర్సింహులు బాండ్ రాశాడు. పనులు చేయడానికి ప్రజల వద్ద చేయి చాచని, పంచాయతీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయనని తెలిపాడు. తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు వెనుకేసుకోనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానని పేర్కొన్నాడు. ఆయన రాసిన బాండ్ పేపర్‌ను గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు.
ఆడపిల్ల పుడితే రూ.5,116
ఆడపిల్ల పుడితే రూ.5,116


