గజ గజ
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2025
కపాస్ కిసాన్ యాప్‌ను
రద్దు చేయాలి: సీపీఎం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని చందాపూర్ శివారులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రైతుల వద్ద ఉన్న పత్తిని కొనుగోలు చేయాలన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు పంటను స్వేచ్ఛగా అమ్ముకోవడానికి ప్రభుత్వం కండిషన్లు పెట్టడం సరికాదన్నారు. ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం సీసీఐ ఆంక్షలు పెట్టిందని విమర్శించా రు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూషణం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు చలితో వణికిపోతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో రాత్రి సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమై డిసెంబర్, జన వరి మాసాల్లో చలి అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. గత రెండు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలో 7.8, 8.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ 10 జిల్లాలలో సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ము ఖ్యంగా వృద్ధులు, చిన్నారులు సాయంత్రం కాగానే ఇంటికే పరిమితం అవుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. అదేవిధంగా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. ఉదయం కూరగాయలను మార్కెట్ తరలించే వారు, పాల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తి తీత పనులతో పాటు చెరుకు నరికే పనులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక కూలీలతో పాటు వలస వచ్చిన వారు ఉదయం పూట చలికి భయపడి పనులకు వెళ్లలేక మధ్యాహ్న సమయంలోనే పనులు చేసుకుంటున్నారు.
మరింత పెరిగే అవకాశం
నవంబర్ నెల చివరి వరకు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మరో రెండు రోజుల పాటు మధ్యాహ్న సమయంలో కూడా శీతలగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు కనీస జాగ్రత్తలు వహిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు చిన్నారులు కనీస జాగ్రత్తలు వహించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లానువణికిస్తున్న చలి
గజ గజ


