అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి జోన్: వృద్ధులు భావితరాల యువతకు దారి చూపే మార్గదర్శకులు అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల కుటుంబ, ఆస్తి, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబ వ్యవస్థలు మారిపోవడంతో వృద్ధులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. దీంతో ఒంటరితనం పెరిగిపోతుందన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి డాక్టర్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.


