పునరావాసం కల్పించండి
జహీరాబాద్ టౌన్: పునరావాసం కల్పించకుండా నిమ్జ్ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టరాదని వ్యవసాయ కూలీలు శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ మాట్లాడుతూ.. అధికారులు భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సిన పునరావాసం విషయంలో ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూలీకు ఏ రకమైన న్యాయం చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.


