మా‘వాణి ’ వినండి..
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
● మదిమిలో.. తిప్పలెన్నో
సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇవ్వటానికి వచ్చారు. ఈక్రమంలో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధలు చెప్పుకుందామని వస్తే లోపలి వరకు వెళ్లటం వారికి సమస్యగా మారింది. వీల్‌చైర్ అందుబాటులో లేకపోవటంతో పడరానిపాట్లు పడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
సంగారెడ్డిజోన్: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. సో మవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 32 వినతులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొన్ని నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని అధికారుల ఎదుట ప్రజలు వాపోయారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
							మా‘వాణి ’ వినండి..
							మా‘వాణి ’ వినండి..
							మా‘వాణి ’ వినండి..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
