సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
రామాయంపేట(మెదక్): రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఇన్‌చార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ తెలిపారు. సోమవారం మండలంలోని కోనాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయడాన్ని ప్రోత్సహిస్తూ.. మొక్కజొన్న సాగు విస్తరణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట విత్తనం దశ నుంచి కోత దశ వరకు అన్ని సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటపై అవగాహనతో పాటు సబ్సి డీపై విత్తనాల పంపిణీ చేస్తున్నామన్నారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించిన మొక్కజొన్న పంట కాలం 115– 120 రోజుల మధ్యలో పూర్తవుతుందన్నారు. యాసంగి సీజన్‌్‌కు అనుకూలంగా ఉండే చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్‌కుమార్, రైతులు త దితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
