అక్రమ మట్టి తవ్వకాలపై ఉక్కుపాదం
సిద్దిపేటఅర్బన్: అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిని అడ్డుకొని హిటాచీ, టిప్పర్‌లను పోలీసులు సీజ్ చేశారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి అనుమతి లేకుండా సుడా మోడల్ వెంచర్‌కు చెందిన ప్రభుత్వ భూమిలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలించి విక్రయిస్తున్నారని గ్రామ యువకులు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్‌ఐ మల్లేశం, సిబ్బందితో వెళ్లి టిప్పర్ డ్రైవర్లు బోదాసు నర్సింహులు, రేపాక రాజు, హిటాచీ ఆపరేటర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వంగ ప్రవీణ్‌రెడ్డి వెంచర్‌లో మట్టి పోయించుకుంటున్నాడని తెలిపారు. కాగా నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు


