తాగి డ్రైవ్‌ చేస్తే పదివేలు ఫైన్‌ | - | Sakshi
Sakshi News home page

తాగి డ్రైవ్‌ చేస్తే పదివేలు ఫైన్‌

Oct 28 2025 9:11 AM | Updated on Oct 28 2025 9:11 AM

తాగి డ్రైవ్‌ చేస్తే పదివేలు ఫైన్‌

తాగి డ్రైవ్‌ చేస్తే పదివేలు ఫైన్‌

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమాన అమల్లోకి వచ్చినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. సీఐ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.70వేలు జరిమాన విధించారు.

గంజాయి రహిత జిల్లాకు కృషి

సీపీ విజయ్‌ కుమార్‌

దుబ్బాకటౌన్‌ /దౌల్తాబాద్‌ (దుబ్బాక) /కొండపాక(గజ్వేల్‌): డ్రగ్స్‌ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామని పోలీస్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం బేగంపేట, రాయపోల్‌, దౌల్తాబాద్‌, కుకునూరుపల్లి పోలీస్‌ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... మైనర్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, వితౌట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ నడిపే వాహనదారులపై దృష్టి సారించాలన్నారు. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్‌ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ షేక్‌ లతీఫ్‌, బేగంపేట ఎస్సై మహిపాల్‌ రెడ్డి, రాయపోల్‌ ఎస్‌ఐ మానస, ఏఎస్‌ఐలు, ఎస్సై అరుణ్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బ్యాంకు రికవరీ ఏజెంట్‌

ఆత్మహత్య

అల్లాదుర్గం(మెదక్‌): చెరువులో దూకి వ్యక్తి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. చెరువు వద్ద దొరికిన ఆనవాళ్లు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం... రాంచంద్రపురానికి చెందిన నాగాచారి(42) హైదరాబాద్‌ బోడుప్పల్‌ ఎస్‌బీఐ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. టీఎస్‌ 08 జీజె2645 బైక్‌పై రాంపూర్‌ చెరువు కట్టకు వద్దకు వచ్చాడు. ఐడీ కార్డు, బైక్‌ తాళం చెవి కట్టపై పెట్టి చెరువులో దూకాడు. ఆ సమయంలో వ్యవసాయ పనులు చేస్తున్న వారు చూసి అక్కడికి చేరుకునేలోపు దూకాడు. అక్కడ లభించిన ఆధారాలతో ఎస్‌బీఐ రికవరీ ఏజెంట్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ శంకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చెరువు కట్టపై ఉన్న ఆధారాలతో పోలీసులు భార్యకు సమాచారం ఇచ్చారు. కాగా కొన్నిరోజులుగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్‌ఐని సంప్రదించగా చెరువులో దూకిన వ్యక్తి బాడీ పైకి తెలలేదని , పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

గుర్తుతెలియని

మృతదేహం లభ్యం

సంగారెడ్డి క్రైమ్‌: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం సంగారెడ్డి పట్టణంలోని స్థానిక మహబూబ్‌సాగర్‌ చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చెరుకుని మృతదేహన్ని బయటకు తీశారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను బట్టి హైదరాబాద్‌లోని బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన ఫాతిమా (27)గా పోలీసులు గుర్తించారు. చెరువును చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిదా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ప్రభు త్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గజ్వేల్‌రూరల్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన మినుముల నర్సింహులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు.

మృతురాలి వివరాలు గుర్తింపు

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని ధరిపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో మృతి చెందిన మహిళ మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎరుకల చంద్రవ్వగా గుర్తించినట్లు ఏఎస్‌ఐ విఠల్‌నాయక్‌ తెలిపారు. సోమవారం చంద్రవ్వ కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలికి మతిస్తిమితం సరిగా లేదని, వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement