
భూమి పోతుందనే మనస్తాపంతో రైతు..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతోఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): తనకున్న భూమి పోతుందని మనస్తాపంతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం... గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల సత్యనారాయణగౌడ్(55) యాభై ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూమి వివాదం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగా ఖర్చులకు ఇబ్బందులు నెలకొనడం, వివాదం పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌లో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీకి తరలించగా అర్ధరాత్రి మృతిచెందాడు.
అప్పుల బాధతో యువకుడు..
నర్సాపూర్ రూరల్: యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తుజాల్‌పూర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలి రమేశ్ చిన్న కుమారుడు శివ ప్రసాద్ (22) వృత్తిరీత్యా డీజే నిర్వహిస్తున్నాడు. డీజే కొనుగోలు కోసం రెండేళ్ల క్రితం తెలిసిన వారి వద్ద రూ.3 లక్షల 15వేలు అప్పు చేశాడు. సరైన గిరాకీ లేకపోవడంతో తీసుకున్న అప్పు చెల్లించలేక మనస్తాపానికి గురై రాత్రి పొలం వద్ద ఉన్న కోళ్ల ఫారంలో ఉరి వేసుకున్నాడు.
కుటుంబ కలహాలతో..
దుబ్బాకటౌన్: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహిల్‌పాల్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి(36) వ్యవసాయం చేస్తూ, భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. కాగా కుటుంబంలో స్వామికి తరచూ గొడవలు జరుగుతుందడేవి. ఆదివారం సైతం గొడవ జరగగా మనస్తాపం చెందిన స్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
యాసిడ్ తాగి...
సదాశివపేట(సంగారెడ్డి): యాసిడ్ తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ వెంకటేశం కథనం ప్రకారం... పట్టణానికి చెందిన వికాస్(28) ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై తీవ్ర ఒత్తిడికి గురై శనివారం ఉదయం ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ తాగి వాంతులు చేసుకున్నాడు. గమనించిన తండ్రి విశ్వేశ్వర్‌రావు పట్టణంలోని మాతృశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని జూబ్లిహీల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

భూమి పోతుందనే మనస్తాపంతో రైతు..

భూమి పోతుందనే మనస్తాపంతో రైతు..