
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దుబ్బాక : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపల్‌లోని లచ్చపేట మాడల్‌స్కూల్ గ్రౌండ్‌లో పీవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో నియోజకవర్గంలోని 60 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు యువత, విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు పీవీఆర్ ట్రస్టు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చందిరి సంజీవరెడ్డి, అందె రాజిరెడ్డి, గిరిబాబు, వెంకట్ తదితరులు ఉన్నారు.