
కేక్ కట్ చేసి.. పండ్లు పంపిణీ చేసి
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, రాష్ట్రానికి మరిన్ని సేవ లు అందించాలని చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, శ్రీహరి, చింత గోపాల్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మాజీ జెడ్పీటీసీ కొండల్‌రెడ్డి, పాండురంగం, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.