
ఖేడ్ అభివృద్ధికి రూ. 60 కోట్లు విడుదల
నారాయణఖేడ్: నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి పనుల కోసం రూ. 60 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ. 280 కోట్లు త్వరలో మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీఐ నిర్మాణం కోసం రూ. 45 కోట్లు విడుదల అయ్యా యని తెలిపారు. మోర్గి వద్ద గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిన వంతెన నాసిరకంగా నిర్మించడంతో దాన్ని తొలగించి జాతీయ రహదారుల నాణ్యతతో కొత్త వంతెన కోసం రూ. 6.50 కో ట్లు, నమ్లిమెట్– పోతన్‌పల్లి మధ్య వంతెన కోసం రూ.1.40 కోట్లు పీఎంజీఎస్‌వై కింద మంజూరైనట్లు తెలిపారు. ఖేడ్– కరస్‌గుత్తి, ఖేడ్– రాయిపల్లి రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. హ్యామ్ ద్వారా రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ప్రధాన రోడ్లు, ప్రధాన రోడ్ల నుంచి గ్రామాలు, తండాలకు రోడ్ల కోసం రూ. 280 కో ట్లతో ప్రతిపాదనలు పంపగా, త్వరలో మంజూరు కానున్నాయన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ పాటిల్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ దారం శంకర్, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి